రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కిన్నెర సంస్థ నిర్వహిస్తోన్న భాషా మహోత్సవాలను మరో 15 రోజులపాటు జరపాలని నిర్ణయించినట్లు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్. కవితా ప్రసాద్ వెల్లడించారు.
ఇప్పటిదాకా నిర్వహించిన ఈ భాషా మహోత్సవాలలో భాగంగా... తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాదానికి, బహుజన, దళిత, ముస్లిం, మైనారిటీ వాదాలకు తగిన ప్రోత్సాహం లభించటం లేదని కొంతమంది అసంతృప్తి, నిరసన వ్యక్తం చేయడంవల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవితా ప్రసాద్ తెలిపారు.
అంతేగాకుండా... పైన పేర్కొన్న వాదాలకు సంబంధించిన సాహిత్య దృక్పథాలకు కూడా స్థానం కల్పించేందుకు భాషా మహోత్సవాలను మరో 15 రోజులపాటు నిర్వహించే ఉద్దేశ్యంతో ఉన్నామని కవిత చెప్పారు. ఈ ఉత్సవాల వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని ఆమె పేర్కొన్నారు.