ఊరికి దూరంగా ఆ ఇద్దరే రొమాన్స్... 'కాఫీ విత్ మై వైఫ్' అదే

మంగళవారం, 25 ఫిబ్రవరి 2014 (19:41 IST)
WD
ప్రేమించి పెళ్లిచేసుకుని ఇద్దరే ఊరికి దూరంగా రొమాన్స్‌ చేసుకుంటే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో 'కాఫీ విత్‌ మై వైఫ్‌' రూపొందుతోంది. చిత్రం షూటింగ్‌ పూర్తయినా ఇంకా సెన్సార్‌ కాలేదు. ఇప్పటికే యూత్‌ను ఆకట్టుకునే ఫొటోలు వచ్చేశాయి. ఈ చిత్రం గురించి దర్శకుడు విద్యాసాగర్‌ మాట్లాడుతూ... కొంచెం ప్రేమ, కొంచెం రొమాన్స్‌, కొన్ని అలకలు కలగలిస్తేనే చక్కని దాంపత్యం అవుతుందనే కథాంశంతో రూపొందిన చిత్రం అనీష్‌ తేజేశ్వర్‌, సింధు లోక్‌నాథ్‌ జంటగా నీలం శంకర్‌ సమర్పణలో మదన్‌ నిర్మించారు.

విద్యాసాగర్‌ దర్శకుడు. మార్చి ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. కొత్తగా పెళ్లిచేసుకున్న ఓ ఇద్దరు ప్రేమికుల జీవితంలోని కొంగొత్త పరిణామాలే ఈ సినిమా. లైఫ్‌లో రొమాన్స్‌ ఉండాలనేది కొత్తతరం కోరిక.

అది ఎలా ఉంటే అందంగా ఉంటుందో తెలియజెప్పే సినిమా. పెళ్లి చేసుకోబోయేవాళ్లకు, చేసుకున్నవాళ్ళకు ఇద్దరికీ జీవితంలో కొత్త కోణాలను చూపిస్తుంది. ఎందుకంటే కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ ఇద్దరు ప్రేమికుల జీవితంలోని మధుర సంఘటనలను ఎక్కడా విసుగు పుట్టించకుండా చూపించాం. క్లుప్తంగా చెప్పాలంటే స్వీట్‌ రొమాన్స్‌, ఫ్యూర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ల కలబోత ఇది. పాటలకు మంచి ఆదరణ లభించింది. సినిమా కూడా అందిర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మంత్ర ఆనంద్‌, కెమెరా: విశ్వ దేవబత్తుల, కథ, మాటలు, నిర్మాత: మదన్‌, దర్శకత్వం: విద్యాసాగర్‌.

వెబ్దునియా పై చదవండి