నగ్నసత్యంలో వీణా మాలిక్ టెంప్ట్ చేస్తుందట... కానీ అలా చూపించకుండా...
మంగళవారం, 25 మార్చి 2014 (17:07 IST)
WD
సినిమాలకు పబ్లిసిటీ కొత్తగా చేయడం తెలిసిందే. పేరున్న హీరోహీరోయిన్లు ఉన్న సినిమాకు సరేసరి. కానీ అదొక శృంగార చిత్రమయితే దానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వీణా మాలిక్ నటించిన నగ్న సత్యం విషయంలోనూ ఇదే జరిగింది. రిలీజ్‌కు ముందుగానే అందులో నటించే కాస్టింగ్స్‌తో పబ్లిసిటీ ఇస్తే కొన్ని స్వచ్చంద సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తాయని నిర్మాతలు తెలివిగా ప్రవర్తించాడు.
'నగ్న సత్యం' చిత్రంలో పాక్ నటి వీణామాలిక్ నటిస్తోంది. అందులో ఆమె నటించిన సీన్స్ చాలావరకు టెంప్ట్ చేసేవిగా ఉన్నాయి. అయితే ఇవి కనుక పబ్లిసిటీలో వాడితే అసలుకే ఎసరు వస్తుందనుకున్న నిర్మాతలు తెలివిగా ప్లాన్ చేశారు.
కార్టూన్ బొమ్మలు వేసి రాజకీయ నాయకుడు, రౌడీలు కలిసి అమ్మాయిని దోచుకుంటుంటే పై నుంచి పోలీసు చేతులతో ఆశీర్వదిస్తున్నట్లు డ్రా చేయించారట. ఈ పోస్టర్‌కు మంచి అప్లాజ్ వచ్చిందట. దీంతో తమ నగ్న సత్యం చిత్రం విడుదలకు ఎటువంటి ఇబ్బంది లేదని నిర్మాత భావిస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 29న విడుదలకు సిద్ధమైంది.