27న వస్తున్న 'భీమవరం బుల్లోడు'

శనివారం, 22 ఫిబ్రవరి 2014 (18:24 IST)
WD
సునీల్‌-ఎస్తేర్‌ (1000 అబద్ధాలు ఫేం) జంటగా ఉదయశంకర్‌ దర్శకత్వంలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ 'సురేష్‌ ప్రొడక్షన్స్‌' నిర్మిస్తున్న చిత్రం 'భీమవరం బుల్లోడు'. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 27న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ... 'మా సంస్థ నుంచి వస్తున్న 'భీమవరం బుల్లోడు' చిత్రం మా సంస్థకు ఎంతో ప్రతిష్టాత్మకం. ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 27న విడుదల చేస్తున్నాం. మా చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అన్నారు.

తనికెళ్లభరణి, జయప్రకాష్‌రెడ్డి, షాయాజి షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, అదుర్స్‌ రఘు, సత్యం రాజేష్‌, శ్రీనివాసరెడ్డి, గౌతంరాజు, తాగుబోతు రమేష్‌, సామ్రాట్‌, తెలంగాణా శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణు ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కథ: కవి కాళిదాస్‌, మాటలు: శ్రీధర్‌ సీపన, ఛాయాగ్రహణం: సంతోష్‌ రాయ్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, కళ: వివేక్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: బి.జి.నాయుడు-రమేష్‌ పప్పు, నిర్మాత: డి.సురేష్‌బాబు, చిత్రానువాదం-దర్శకత్వం: ఉదయశంకర్‌!

వెబ్దునియా పై చదవండి