'జన్మస్థానం' విడుదలకు సిద్ధమవుతోంది!

మంగళవారం, 17 జూన్ 2014 (17:53 IST)
గోరింటాకు, పుట్టింటికిరా చెల్లి... వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఓంసాయిప్రకాష్‌ కన్నడ, తెలుగులో అందిస్తున్న సినిమా 'జన్మస్థానం'. సాయికుమార్‌ ముఖ్యభూమిక ప్లే చేస్తుండగా నటి ప్రత్యూష సోదరుడు కృష్ణచంద్ర హీరోగా నటిస్తున్నాడు. షమాసింగ్‌, పావని, రూపిక హీరోయిన్లు. సువన్‌రాయ్‌ ప్రొడక్షన్స్‌ పై కె. రాయన్న నిర్మిస్తున్నాడు. సినిమా షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా సోమవారం రాత్రి ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ.. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 22 పాటల్ని, 15 రోజుల్లో సినిమాను విడుదల చేస్తామని చెప్పారు.
 
సుద్దాల అశోక్‌ తేజ మాట్లాడుతూ... సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో నేను మూడు పాటలు, నిర్మాత మరో రెండు పాటలు రాశారని చెప్పారు. ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతం అందించారు.

వెబ్దునియా పై చదవండి