నాగశౌర్య-రాశిఖన్నా జంటగా శ్రీనివాస్ అవసరాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ఊహలు గుసగుసలాడే. కళ్యాణి కోడూరి సంగీత సారథ్యం వహించారు. సెన్సార్ సహా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 20న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ సందర్భంగా సాయి కొర్రపాటి మాట్లాడుతూ... రీసెంట్ గా రిలీజైన మా ఆడియోకి మంచి స్పందన లభిస్తోంది. శ్రీనివాస్ అవసరాల ఊహల గుసగుసలాడే చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. హీరో నాగశౌర్యకు ఈ చిత్రం మంచి బ్రేక్ నిస్తుంది. కళ్యాణి కోడూరు అందించిన బాణీలు యూత్ తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకుంటున్నాయి. క్లీన్ యు సర్టిఫికెట్ అందుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేయనున్నాం. మా మునుపటి చిత్రాల వలె ఊహలు గుసగుసలాడే కూడా అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాని అన్నారు.