'ఓం 3డి' ఎలా ఉంటుంది?

గురువారం, 27 జూన్ 2013 (20:21 IST)
WD
ఇప్పటికే తెలుగులో తొలిసారిగా 3డి సినిమా తీశామని 'యాక్షన్‌ 3డి' చిత్రాన్ని ముందుకు తెచ్చారు దర్శనిర్మాత అనిల్‌సుంకర. అది ఊహించినంత సక్సెస్‌ కాకపోగా, 3డి ఎఫెక్ట్స్‌ ప్రేక్షకుల్ని అలరించలేదని టాలీవుడ్‌ టాక్‌. ఇప్పుడు మరో యాక్షన్‌ సినిమా రాబోతుంది. నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా, హీరోగా చేసిన 'ఓం' చిత్రం. ఈ చిత్రం రిలీజ్‌కు ప్లాన్‌లు జరుగుతున్నాయి.

టెక్నికల్‌ కారణాలవల్ల ఆలస్యమైనా.. జులై 19న విడుదల చేస్తున్నట్లు ప్రకటించేశారు. అనుకున్నట్లు అన్నీ కుదిరితే ఆ తేదీని విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఇప్పటికే చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. అయితే పాటలకు అంత రెస్పాన్స్‌ రాలేదు.

కళ్యాణ్‌ రామ్‌కు టెక్నికల్‌గా కొన్ని విషయాలు తెలుసు గనుక.. ఈ సినిమా ఆయనకు చాలా హెల్ప్‌ అవుతుందని దర్శకుడు చెబుతున్నాడు. కృతికర్బంద హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. తెలుగువారి సెంటిమెంట్‌ రీత్యా..ఇందులో మదర్‌ సెంటిమెంట్‌ కూడా ఉందని సమాచారం. ఈ చిత్రానికి అవతార్‌ చిత్రానికి పనిచేసిన టెక్నికల్‌ టీమ్‌ పనిచేశారు. మరి ఈ చిత్రం చూశాక ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

వెబ్దునియా పై చదవండి