మత్సకారుల జీవితాల నేపథ్యంలో రేవు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

డీవీ

శుక్రవారం, 23 ఆగస్టు 2024 (14:45 IST)
Revu movie
నటీనటులు: వంశీ రామ్ పెండ్యాల, స్వాతి భీమి రెడ్డి, హేమంత్ ఉద్భవ్, సుమేద్ మాధవన్, లీలా వెంకటేష్ కొమ్మూరి, అజయ్, ఏపూరి హరి తదితరులు
సాంకేతికత: దర్శకుడు: హరినాథ్ పులి, నిర్మాత: మురళి గింజుపల్లి, నవీన్ పారుపల్లి
 
రేవు అనే టైటిల్ చూడగానే ఇది ఓడరేవులు, మత్సకారుల జీవితాల కథ అని తెలిసిపోతుంది. బ్లాక్ అండ్ వైట్ టీవీలు, రేడియోలు వున్న కాలంలో ఓ ప్రాంతంలో జరిగిన మత్సకారుల జీవితకారుల కథగా చిత్ర యూనిట్ చెబుతూవచ్చింది. అంతా కొత్త తారాగణంతో రూపొందిన ఈ సినిమా నేడే విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ:
సముద్రతీర గ్రామమైన పాలరేవులో అంకాలు (వంశీ రామ్ పెండ్యాల), గంగయ్య (అజయ్) అనే ఇద్దరు మత్స్యకారుల మధ్య పోటీపై కథ కేంద్రీకృతమై ఉంది. చిన్న చిన్న పడవులతో సముద్రంలో చేపలు పట్టుకునేరావే అంకాలు వంశీయులు. అయితే ఊరిలో కరణం స్థాయిలో వున్న ఆాసామి వీరిని దెబ్బకొట్టాలని మరపడవలు, మోటార్లతో పోటీకి వస్తాడు. నాగేసు (యేపూరి హరి) రాకతో సామ్రాజ్యం (స్వాతి భీమి రెడ్డి), సామ శివ (సుమేష్ మాధవన్), సదా శివ (హేమంత్ ఉద్భవ్), భూషణ్ (లీలా వెంకటేష్ కొమ్ములి) జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి.ఆ క్రమంలో జరిగిన పోరులో అతను చనిపోతాడు. ఆ తర్వాత ఆయన కొడుకులు మత్సకారులపై రివెంజ్ తీసుకోవడానికి చేసిన ప్రయత్నమే మిగిలిన కథ. 
 
సమీక్ష:
 
పూర్తిగా మత్సకారుల జీవితాల నేపథ్యం గనుక ఆ కోణంలోనే పాత్రలున్నాయి. అంతా కొత్తవారైనా వారి పరిధిమేరకు నటించారు. మత్సకారుల్లో వుండే వ్యక్తీకరణలు, భావోద్వేగాలు వారి నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. యాసతో కూడిన సంభాషణలు పొందికగా వున్నాయి. భారీ డైలాగ్స్ లేకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. పాత్రలకు తగిన మేనరిజాలు కూడా చూపించాడు.  
 
అజయ్ తన నటన సన్నివేశాలను ఎలివేట్ చేస్తుంది, వంశీ రామ్ పెండ్యాల,  అజయ్ నటించిన సన్నివేశాలు ఒక అద్భుతమైన డైనమిక్‌ని సృష్టించి, సినిమాను మరో స్థాయికి ఎలివేట్ చేశాయి. స్వాతి భీమిరెడ్డి వున్నంతలో నటనను ప్రదర్శించగా, ఏపూరి హరి ప్రతినాయకుడిగా మెప్పించాడు. సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్ యేపూరి హరి యొక్క దుర్మార్గపు అనుచరులను తెరపై బాగా చూపించారు. లీలా వెంకటేష్ కొమ్ములి కూడా తన నటనను ప్రదర్శించి మెరిసింది.
 
రచయిత-దర్శకుడు హరినాథ్ పులి ఒక్కరే కాబట్టి కథను ఆకర్షణీయంగా తెలియజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఆ క్రమంలో మరికొంత కసరత్తు చేస్తే బాగుండేది. కొందరు కొత్తవారైనా వారి పాత్రలలో సహజం లోపించింది. టేకింగ్ పరంగా ఇంకాస్త జాగ్రత్త తీసుకొంటే బాగుండేది. గతంలో ఊరిలో జరిగిన కథగా బుర్రథ చెప్పే ఎల్.బి. శ్రీరామ్ పాత్రతో చెప్పిస్తూ, మధ్యలో మరో నెరేషన్ మరొకరు చెప్పడంతో కాస్త కన్ ప్యూజ్ గా అనిపిస్తుంది. ఇలాంటి కథను రివర్స్ స్క్రీన్ ప్లే లో చెబితే ఇప్పటి ట్రెండ్ కు బాగా కనెక్ట్ అయ్యేది.
 
రంగస్థలం తరహా కాలం నాటి కథ గనుక కొంచెం కేర్ తీసుకుని వుంటే భారీ సినిమా అయ్యేది. ఏది ఏమైనా దర్శకుడు స్థాయిని బట్టి వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో పాటలు బాగున్నాయి. కెమెరా పనితనం బాగుంది. అధిక హింస సన్నివేశాలు వుండడంతో ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను దూరం చేయవచ్చు. గ్రామీణ నేపథ్యాన్ని సంగ్రహించే వాస్తవిక, సహజమైన సంభాషణలతో మెప్పించే ప్రయత్నం చేశారు. 
 
అలాగే, జాన్ కె జోసెఫ్ సంగీతం భావోద్వేగాలను స్పుశించేలా చేశాడు. విశాఖ మురళీధరన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. రేవంత్ సాగర్ సినిమాటోగ్రఫీ పల్లెటూరి వాతావరణాన్ని, కోస్తా ప్రాంతాన్ని అందంగా చిత్రీకరించి, వాస్తవికతను జోడించింది. శివ సర్వాణి ఎడిటింగ్ అయితే మరింత షార్ప్ గా వుంటే బాగుండేది.  మురళి గింజుపల్లి, నవీన్ పారుపల్లి నిర్మాతలుగా తమ అభిరుచిని చాటారు. 
 
నిర్మాణాన్ని పర్యవేక్షించిన సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్న మరో సీనియర్ జర్నలిస్ట్ రాంబాబు పర్వతనేని ఈ ప్రాజెక్ట్ చేయడంలో తమ అనుభవాన్ని చూపించారు. ఓ మంచి ప్రయత్నం చేసిన ఈ సినిమా సీక్వెల్ కు కూడా ఛాన్స్ వుండేలా అనిపిస్తుంది. వినోదాత్మక అంశాలు పెద్దగా లేకపోవడంతో సీరియస్ మూవీగా సాగిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ బట్టి ఈ సినిమా రేంజ్ పెరగవచ్చు. 
 రేటింగ్: 2.75/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు