కన్నడ సినిమా కాంతారా నుంచి తెలుగు వారికి రిషబ్ శెట్టి అనే పేరు వెలుగులోకి వచ్చింది. తను బెంగుళూరులోని గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ నుండి ఫిల్మ్ డైరెక్షన్‌లో డిప్లొమా తీసుకున్నాడు. కాంతారా సినిమాకు రచన, దర్శకత్వంతోపాటు కథానాయకుడిగా చేశాడు. హోంబళే ఫిలిం వారు నిర్మించిన ఈ సినిమా. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. అక్టోబర్ 15న ఈ సినిమా తెలుగులో విడుదలైంది. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ :
అది ఓ గిరిజన ఆటవిక ప్రాంతం. రాజుల పాలనలో ఓ రాజు అక్కడి గిరిజనులకు వందల ఎకరాల భూమిని దేవాలయ బూముల కింద దానం చేస్తాడు. అక్కడి ప్రజలు కోలం పేరుతో ప్రతి ఏడాది పండుగ చేసుకుంటారు. కాలక్రమంలో ఆయన వారసులు ఆ భూమి విలువ కోట్లకు చేరడంతో దాన్ని తిరిగి తీసుకోవాలని ప్రయత్నించి కోర్టుకు వెళతానంటాడు. పండుగనాడు దేవుడుపూనిన వ్యక్తి అలా వద్దని వెలితే చస్తావని చెబుతాడు. చెప్పినా వినడు. కట్‌చేస్తే తెల్లవారి అతను కోర్టుముందు రక్తం కక్కుకుని చస్తాడు.
ఆ తర్వాత మరణించిన ఆయన వారసుడు భూస్వామ్య దొర (అచ్యుత్ కుమార్) అక్కడ గ్రామస్తులచేత తనకు కావాల్సిన పనులు చేయించుకుంటాడు. ఆయన అండతో ఆ ఊరిలో శివ (రిషబ్ శెట్టి) తన స్నేహితులతో కలిసి వేటాడుతూ తాగి తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఫారెస్ట్ అధికారి మురళీ(కిశోర్)తో శివ కి గొడవ జరుగుతుంది. ఆ తర్వాత శివ ప్రేయసి కాస్త చదువుకుని ఫారెస్ట్ గార్డ్‌గా ఉద్యోగం కోసం అదే గ్రామానికే వస్తుంది. ఈలోగా అధికారి మురళి ఆధ్వర్యంలో ఫారెస్ట్ ల్యాండ్‌ను సర్వే చేయించి గిరిజనుల బూముల్ని తీసుకోవాలని చూస్తాడు. ఇంకోవైపు అతనికి దొర వత్తాసుపలికి పనులు చేయించుకుంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా కొన్ని ఊహించని సంఘటనలు జరిగి శివ దేవదూతగా మారిపోవాల్సివ స్తుంది. అలా ఎందుకు జరిగింది? అసలు నిజంగానే దేవుడు వున్నాడా? అనేది సినిమాలోని మిగిలిన కథ.
విశ్లేషణ
గిరిజన అటవీ ప్రాంతం అక్కడ ప్రజలు, భూస్వాములు పెత్తనం, అవినీతి ఫారెస్ట్ సిబ్బంది వంటి కథలు తెలుగులో వచ్చినా కాంతారా మాత్రం భిన్నమైనదిగా వుంటూ అప్పటి ఆచార వ్యవహారాలు, అలవాట్లు, దేవుడిపై నమ్మకం కలగలిపి ప్రేక్షకుడ్ని రంజింపచేసేలా దర్శకుడు చేయగలిగాడు. కర్ణాటకలోని ఓ తెగకు సంబంధించిన ఇతివృత్తం ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో కుటుంబ బంధాలు, అనుబంధాలు అన్నీ సన్నివేశాలపరంగా చూపించగలిగాడు.
శివ పాత్రల్లో రిషబ్ శెట్టి నటన తెలుగువారికీ ఆకట్టుకునేలా వుంటుంది. తన తమ్ముడు గురవా చనిపోయాడని తెలిసే సన్నివేశంలోనూ పతాక సన్నివేశాల్లో దేవుడు ఆవహించే సీన్‌లోనూ ప్రేక్షకులను కట్టిపడేశాడనే చెప్పాలి.
సహజంగా అడవీ ప్రాంతం అంటే ఎర్రచందనం, వీరప్పన్ స్మగ్గింగ్ వంటి వాటిపైనే సినిమాలు వచ్చాయి. కాంతారాలోనూ వీరప్పన్ ప్రస్తావన వచ్చినా ఎక్కడా ఆ ఛాయలు లేకుండా రాజుల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న భూములు ఈ కాలంలో భూస్వాములు ఏవిధంగా వారిని బుట్టలో వేయాలనుకుంటాడనేవి ఆసక్తికరంగా మలిచాడు.
భూస్వాముల ఇంటిలోకి ఇతరులు వస్తే పనిషిమెంటే. అప్పటి ఆచారాలను కూడా చక్కగా చూపించాడు. సంభాషణపంగా శివ పాత్ర దొర ఇంటికి వచ్చి సున్నితమైన వార్నింగ్ ఇచ్చినప్పుడు టైం ఎంతైంది అని అడగడం.. వెనకే వుందు చూసుకో అని దొర అనడంతో.. టైం కూడా మా వెనుకే వుందా! అంటూ సందర్శానుసారంగా సంభాషణలు బాగా కుదిరాయి. రిషబ్ శెట్టి సినిమా ముగింపులో చక్కని దర్శకత్వ పనితనం కనబర్చాడు. క్లైమాక్స్ చాలా బాగుంది.
- ఇంత ఇదిగా సినిమా తీసినా కొన్ని చిన్నపాటి తప్పిదాలు ఇందులో కనిపిస్తాయి. కొన్ని సీన్స్ లో టిపికల్ నేరేషన్ కొనసాగుతుంది. ఫస్ట్ హాఫ్ కథనం ఉండాల్సిన స్థాయిలో ఆసక్తికరంగా లేదు. సెకండాఫ్ సినిమాకు కీలకం. ఫారెస్ట్ ఆఫీసర్ ఎటువైపు వారికి పనిచేస్తాడో చివరి వరకు అర్థంకాదు. ఊరిలోని దొరకు మరో భూస్వామి విరోధి. ఆ ఎపిసోడ్ సరైన కన్‌క్ల్యూజ్ ఇ వ్వలేదు. మొదటి భాగం చూశాక చాలా సేపటికి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేకపోతాడు.
- టెక్నికల్‌గా చూస్తే, మాటలు బాగున్నాయి. బి అజనీష్ లోక్‌నాథ్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. ముఖ్య సన్నివేశాల్లో అద్భుతంగా ఉంది. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
- హీరోకమ్ దర్శకుడు, కథకుడు ఒక్కడే బాధ్యతలు చేపట్టి గిరిజన ఎమోషన్స్ పలికించడం కష్టమైనా దానిని రిషబ్ శెట్టి చేయగలిగాడు. ప్రధానంగా ముగింపు సన్నివేశంలో ఆయన నటన హైటైట్ అని చెప్పవచ్చు. ఇది అందరూ చూడతగ్గ సినిమా.