ఈమధ్య సినిమాల్లో పెద్దగా లాజిక్‌లు వుండడంలేదు. ముఖ్యంగా భారీ సినిమాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవలే విడుదలైన బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన స్కంద గురించి చెప్పుకోవాల్సిందే. రామ్ పోతినేని ఇందులో హీరోగా నటించాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత అంత మాస్ సినిమా ఇది. ఇందులో కథ పెద్దగా లేకపోయినా, ఇద్దరు సి.ఎం. లను కేంద్రంగా చేసుకుని, కేవలం మాస్ ప్రేక్షకుల కోసం బోయపాటి తీసినట్లుంది. ఇందులో ఎంత వయొలెన్స్ ఉందంటే చెప్పడానికి ఇబ్బందే. మరోవైపు నేపథ్యం సంగీతం సౌండ్ కూడా మరీ శృతిమించింది. చెవులు రొదలు వినిపిస్తాయి. కానీ రెండు రోజుల్లో 27.6 కోట్ల కలెక్షన్స్ జరిగాయని చిత్ర యూనిట్ తెలుపుతోంది.