నటీనటులు: నాగచైతన్య, రాశి ఖన్నా, మాళవికనాయర్ , అవికా గోర్, సంపత్ రాజ్, తులసి, సాయి సుశాంత్ రెడ్డి, ఈశ్వరి రావు, ప్రకాష్ రాజ్ తదితరులు
సాంకేతికత- సినిమాటోగ్రఫీ: పిసి శ్రీరామ్, ఎడిటర్: నవీన్ నూలి, సంగీత దర్శకుడు: ఎస్ థమన్, నిర్మాత: దిల్ రాజు, దర్శకత్వం : విక్రమ్ కె కుమార్, విడుదల తేదీ : జులై 22, 2022
నాగచైతన్యకు `మనం`తో సక్సెస్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అప్పుడెప్పుడో `జోష్` చిత్రంలో చైతన్యకు ప్లాప్ ఇచ్చిన నిర్మాత ఇద్దరూ కలిసి చేసిన చిత్రం థాంక్యూ. ప్రతి మనిషికి ఎవరో ఒకరు సాయం చేస్తారని, వారిని మర్చిపోకుండా థాంక్యూ అని చెప్పడమే మా సినిమా కంటెంట్ అని నిర్మాత దిల్‌రాజు విడుదలకు ముందు క్లారిటీ ఇచ్చేశాడు. మరి ఈరోజు విడుదలైన థాంక్యూ ఎలావుందో చూద్దాం.
కథ :
అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లిన అభిరామ్ (నాగ చైతన్య)కు కన్సల్టెంట్ ప్రకాష్‌రాజ్ దగ్గరకు వస్తాడు. తన ద్వారా ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు. అప్పుడు ప్రకాష్‌రాజ్‌కు కూతురులాంటి ప్రియతో (రాశీఖన్నా)తో ఏర్పడిన పరిచయం అభిరామ్‌ను జీవితంతో పైస్థాయికి వెళ్ళేలా చేస్తుంది. అప్పటినుంచి ఆమెతో సహజీవనం సాగిస్తాడు అభిరామ్. ఆ తర్వాత మరింత స్థాయికి ఎదుగుతున్న క్రమంలో అందరికీ మర్చిపోతాడు. ప్రియనూ సరిగ్గా పట్టించుకోడు. అలాంటి సమయంలో ఓ సంఘటన జరుగుతుంది. దాన్ని నుంచి బయటపడడానికి తాను చేసిన తప్పేమిటో తెలుసుకుని సరిద్దుకోవడానికి అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి ఇండియా వస్తాడు. ఫైనల్‌గా అందరినీ కలిసి తాను ఎలా మారాడన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ-
ఈ చిత్ర చూస్తుండగానే ఒక జనరేషన్‌కు హిందీ సినిమా గుర్తుకువస్తే, ఇప్పటి ట్రెండ్‌కు మహేష్ బాబు నటించిన `మహర్షి`, రవితేజ `నా ఆటోగ్రాఫ్`. స్పురిస్తాయి. నేపథ్యాలు వేరైనా ఫైనల్‌గా వారు రిస్క్ తీసుకుని చేసింది థ్యాంక్స్ అనే పదం కోసమే. అయితే ఈ సినిమా కథ రవి అనే రైటర్ రాయడం, దాన్ని విక్రమ్‌కె.కుమార్ కథనం చేయడం, దిల్‌రాజు కనెక్ట్ అవడం జరగడంతో ఇది కొలిక్కి వచ్చింది.
- అయితే ఇలాంటి కథలకు వ్యక్తిగతంగా చూసుకుంటే ప్రతి వ్యక్తి ఏదో సందర్భంలో థ్యాంక్స్ చెప్పడం మామూలే. ముక్కుమొహం తెలీనివాడికి లిఫ్ట్ ఇస్తేనే థ్యాంక్స్ అని చెబుతాడు. అవతలి వ్యక్తి చిన్న పనిచేస్తేనే థ్యాంక్స్ చెబుతాం. ఇది ఇప్పటితరంకానీ అప్పటి తరం కానీ ఎవరూ మర్చిపోలేనిది. కానీ జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్ళేందుకు దోహదపడిన వారిని మర్చిపోయి అంతా నేనే చేశాననే వారి శాతం తక్కువలో వుంటుంది. వారినుద్దేశించి తీసిన సినిమా ఇది.
- మనిషికి అహం, దర్పం, ఎదుటివారిని లెక్కచేయకపోవడం అనేవి వుంటాయి. అవి ఎవరికివారు నియంత్రించుకోవాలి. అలా చేసుకోకపోతే అభిరామ్ పాత్ర అవుతాడు. మనం ఏంచేస్తున్నామో మన ఆత్మకు తెలుసు. కొన్నిసార్లు మనకు నచ్చనివ్యక్తి కూడా మనకు తెలీకుండా సాయం చేసి ఉన్నతస్థాయికి తీసుకెళతాడు. ఆ పాత్రలో ప్రకాష్‌రాజ్ సరిపోయాడు. ఇలా అభిరామ్ జీవితంలో ముగ్గురు వ్యక్తులు చేసిన పనులు తనకు నచ్చకపోయినా వారికి దూరంగా వుండడంతో తన స్థాయిని పెంచుకున్నాడు. ఆ స్థాయి పెరగడానికి ఇన్‌డైరెక్టర్‌గా వారే కారణం. అందులో శత్రువు కూడా వుండొచ్చు. ఇదే దర్శక నిర్మాతలు చెప్పదలచింది.
- అయితే ఈ కథను అందరూ ఓన్ చేసుకుంటారనేందుకు ఆస్కారం లేదు. నాగచైతన్య మూడు తరహా పాత్రాల్లో సరిపోయాడు. రాశీఖన్నా ఓకే. మాళవిక స్కూల్‌డేస్ పాత్ర చైతన్యకంటే పెద్దదిలా కనిపించింది. ఒకరకంగా ఈ పాత్ర ఆమె చేయడం దిల్‌రాజుకు ఇష్టంలేదు. కానీ దర్శఖుడు కోరికమేరకు ఆమెను పెట్టాల్సివచ్చింది. అవికాగోర్ చెల్లెలుగా నటించి మెప్పించింది.
- థమన్ అందించిన బ్యాక్ స్కోర్ కూడా బాగుంది. పి.సి. శ్రీరామ్ ఫొటోగ్రపీ ఓకే. మిగిలిన సాంకేతిక పనులు బాగానే వున్నాయి. పాటలు ఎందుకో పెద్దగా కనెక్ట్ కావు.
- సెంటిమెంట్ పెద్దగా పండకపోవడం. గతంలో కొన్ని సినిమాలు గుర్తుకురావడం, ఆట్టుకునేలా పాటలు లేకపోవడం, కన్‌వెన్సింగ్‌గా సన్నివేశాలు లేకపోవడం ఈ సినిమాకు ప్రధాన లోపం.
- మనిషి ఎంత అహంకారంతో ఎదుటివాడికి చెడు చేయాలని చూస్తే, కర్మ సిద్ధాంతం వదలదు అనేది ఎం.ఎల్.ఎ. కొడుకు పాత్ర ద్వారా చూపించడం కనెక్టవివ్‌గా అనిపిస్తుంది. ఎమోషనల్ అండ్ లవ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమాలో కొన్ని అంశాలు కనెక్ట్ అవుతాయి. ఫ్యామిలీతో హాయిగా చూసే చిత్రంగా వుంది.