మేము విడిపోయిన కొన్నిరోజులకే 'ఊ అంటావా' సాంగ్ ఆఫర్ వచ్చింది. ఆ పాట తనకెంతో నచ్చింది. అందుకే అందులో యాక్ట్ చేశా. ఈ పురుషాధిక్య సమాజంలో వారిలోని లోపాలు ఎత్తిచూపించడానికి ఈ పాట సరైందని, తన లాంటి స్టార్ సెలబ్రిటీ చెబితే తప్పకుండా అందరికీ చేరువవుతుందని భావించానని సామ్ తెలిపింది.
ఇందులో ఒక్కపాట మినహా మిగిలిన చిత్రీకరణ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది యశోద. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచగా.. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తోంది.
డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే అటు బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలోకి సైతం సామ్ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే తన నిర్మాణంలో సామ్ హిందీ ఫిల్మ్ చేస్తుందని కన్ఫార్మ్ చేసేసింది హీరోయిన్ తాప్సీ.