పక్కా కమర్షియల్‌ రివ్యూ రిపోర్ట్.. మారుతీ మార్క్ నిల్ - జస్ట్ పైసా వసూల్

శుక్రవారం, 1 జులై 2022 (13:18 IST)
Pakka Commercial
సినిమా పేరు : పక్కా కమర్షియల్‌
దర్శకుడు : మారుతీ
నటీనటులు : గోపీచంద్‌, రాశీఖన్నా, సత్య రాజ్‌, సప్తగిరి, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, రావు రమేష్‌
నిర్మాతలు: బన్నీవాస్
సంగీతం : జేక్స్‌ బిజోయ్‌
సినిమాటోగ్రఫీ : కర్మ్‌ చావ్లా
 
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో గోపీచంద్ గారి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పక్కా కమర్షియల్ సినిమా జూలై ఒకటో తేదీన విడుదలైంది. 
 
కథలోకి వెళ్తే.. వృత్తిరీత్యా లాయర్ అయిన రాంచంద్ (గోపీచంద్) ప్రతి విషయంలో పక్కా కమర్షియల్ అయితే అతను చాలా కాలం గ్యాప్ తర్వాత తన ఉద్యోగానికి తిరిగి వస్తాడు. అక్కడ సీరియల్ నటి అయిన ఝాన్సీ (రాశి ఖన్నా) తన సీరియల్‌లో లాయర్ పాత్ర కోసం రాంచంద్ దగ్గర అసిస్టెంట్‌గా చేరుతుంది అయితే ఇద్దరూ ప్రేమలో పడతారు.
 
మరోవైపు రామ్‌చంద్ ఎం ఓకే కేసు విషేయంలో తన తండ్రితో వాదించవలసి వస్తుంది. చివరకు రాంచంద్ కేసు ఎందుకు టేకప్ చేసాడు? ఆ మిస్టరీ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 
పక్కా కమర్షియల్‌ సినిమా ఎలా ఉందంటే?
మారుతీ తనకంటూ ఒక స్టైల్ ని ఏర్పరుచుకున్నారు, ఎందుకంటే అతని అతిపెద్ద వెన్నెముక అతని కామెడీ అని మనందరికీ తెలుసు, అతను ఏ జానర్‌లో అయినా కామెడీని బాగా మిళితం చేసాడు, కానీ పక్కా కమర్షియల్‌లో కామెడీ ఉన్నప్పటికీ మారుతీ చిత్రంలా అనిపించలేదు.
 
సినిమా ముఖ్యమైన పాత్రల పరిచయంతో బాగానే మొదలవుతుంది, కానీ సంఘర్షణ చాల సాదా సీదాగా అనిపిస్తుంది అందువల్ల ప్రేక్షకులకు బోర్ కొట్టవచ్చు. మొదటి సగం మారుతీ మార్క్ కామెడీ మరియు గోపీచంద్ మార్క్ యాక్షన్‌తో సాగిపోతుంది.
 
సెకండాఫ్ కూడా కొత్తగా అయితే ఏముండదు, అందుకే కామెడీ చాలా కృత్రిమంగా కనిపిస్తుంది, ప్రేక్షకులను తమ కామెడీతో కట్టిపడేయడానికి చాలా తెలివైన నటీనటులు ఉన్నారు, అయితే కృత్రిమ కామెడీని 2 గంటల పాటు చూడటం అసాధ్యం అయితే క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది.
 
రామ్‌చంద్‌గా గోపీచంద్‌ బాగానే చేసాడు, ఫుల్‌ లెంగ్త్‌ కామెడీలో కనిపించి చాలా రోజులైంది, అయితే లౌక్యం తరహా బాడీ లాంగ్వేజ్‌, కామెడీ టైమింగ్‌ని గుర్తుకు తెచ్చినా కామెడీ సన్నివేశాలు చేస్తున్నప్పుడు మాత్రం బాగానే చేసాడు. ఝాన్సీగా రాశి కన్న ఫర్వాలేదు.  
 
టెక్నికల్‌గా పక్కా కమర్షియల్ మారుతీ కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది, ఎందుకంటే కర్మ్ చావ్లా సినిమాటోగ్రఫీ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. 
 
చివరగా, పక్కా కమర్షియల్ అనేది పైసా వసూల్ చిత్రమే. 
 
సినిమా రేటింగ్: 3/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు