యూత్ ను టార్గెట్ చేస్తూ తీసిన చిత్రమే SPEED220 రివ్యూ

డీవీ

శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (16:41 IST)
Kolla Ganesh, Bajrang Preeti
కొల్ల గణేష్, మల్లిడి హేమంత్ రెడ్డి, భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్, శర్మ జాహ్నవి  నటించిన చిత్రం SPEED220. హర్ష బీజగం దర్శకత్వం వహించారు. విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు నిర్మించారు. కొత్తవారితో రూపొందిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథగా చెప్పాలంటే... 
ఊరిలో సూర్య (హేమంత్), చందు (గణేష్) ఇద్దరూ స్నేహితులు. అందరికీ సహాయం చేస్తూ తలలో నాలుకగా మెలుగుతారు. వీరు  భిక్షపతి (తాటికొండ మహేంద్రనాథ్) అనే ఓ జమీదారు ఇంట్లో పనిచేస్తూ ఉంటారు. ఆయనకు మాయ (భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్) కుమార్తె వుంటుంది. ఆమెది హైటెక్ భావాలు గలది. కాగా, సూర్య, గణేష్, మాయ ముగ్గురు చిన్నతంనలో కలిసి చదువుతారు. ఆ క్రమంలో మాయ సూర్య, చందులను ఒకరికి తెలియకుండా ఒకరితో సాన్నిహిత్యంగా ఉంటుంది. అయితే చింటూ అనే ఓ చిన్న కుర్రాడితో సూర్యతో స్నేహం ఉంటుంది. షడెన్ గా ఆ కుర్రాడు చనిపోతాడు. అనంతరం మాయ కూడా చనిపోతుంది. దాంతో సూర్య  పిచ్చివాడిలా తయారవుతాడు. ఆ టైంలో సూర్యపై మర్డర్ ఎటాక్ జరుగుతుంది. ఊహించని పరిణామానికి హఠాతుడై అసలు ఏమి జరుగుతుంది? అనే కోణంలో ఆలోచిస్తాడు. చింటూ, మాయలకు ఈ ఎటాక్ కు ఏదో సంబంధం వుందని అనుమానంతో అతను ఏం చేశాడు? అన్నది మిగిలిన కథ.
 
సమీక్ష:
యూత్ ఫుల్ కథ గనుక గతంలో వచ్చిన కొన్ని సినిమాల ఫార్మెట్ లు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆర్ ఎక్స్ 100 స్పురిస్తుంది. ఇలాంటి ఫార్మెట్ నేటి ట్రెండ్ కు తగినట్లుగా దర్శకుడు కొత్త తరహాలో చెబుతూ వస్తున్నారు. దర్శకుడు ఓ డిఫరెంట్ జోనర్ సినిమాగా తెరకెక్కించారు. ఆ క్రమంలో ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి, స్వచ్ఛమైన ప్రేమకోసం ఓ ఇద్దరు యువకులు మీద జరిగే కథ కనుక కొంత రొమాన్స్, సన్నివేశాలు వుంటాయి. నాయికగా నటించిన  ప్రీతి సుందర్ ఎక్స్ పోజింగ్ చేసింది. 
 
ప్రథమభాగంలో యూత్ ఆకట్టుకునే విధంగా కథను రాసుకున్న దర్శకుడు ద్వితీయార్థంలో మాస్ యాక్షన్ సన్నివేశాలతో మలిచాడు. యూత్ ను టార్గెట్ చేసికుని తీసిన సినిమా ఇది. అందుకే తెలివిగా నిడివి తక్కువ వుండటంతో సినిమా ఎక్కడా బోరింగ్ లేకుండా సాగిపోతుంది.
 
ఇక నటనాపరంగా మాయ పాత్రలో చేసిన భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్ సినిమాకి ప్రధాన ఆకర్షణ. చాలా సులువుగా బోల్డ్ సీన్స్ లో నటించేసింది. ఉత్తరాది అమ్మాయి కనుక స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. మల్లిడి హేమంత్ రెడ్డి సూర్య పాత్రలో రఫ్ గా కనిపించి ఆకట్టుకుంటారు. గణేష్ కూడా చందు పాత్రలో మెప్పించారు. సుప్రియ పాత్రలో చేసిన శర్మ జాహ్నవి  పల్లెటూరి అమ్మాయి పాత్రలో లంగా వోణిలో ఆకట్టుకుంటుంది. భిక్షపతిగా  తాటికొండ మహేంద్రనాథ్ నటన కూడా పర్వాలేదు. చింటూ పాత్రలో కనిపించిన చిన్నకుర్రాడు కూడా తన పాత్రకు న్యాయం చేశారు.
 
దర్శకుడు హర్ష రాసుకున్న కథలో గ్రామీణ అమ్మాయి ఆదునిక భావాలు గల అమ్మాయిగా ఎందుకు తయారైందో చిన్న క్లారిటీ మిస్ చేశారు. ముక్కోణఫు ప్రేమకథగా తీర్చిదిద్దాడు. అయితే గతంలో ఓటీటీలో ఈ తరహా యువతి నేపథ్యంలో సినిమా వచ్చింది. అందులో తల్లిదండ్రులు అన్యోన్యంగా కలిసి వుండడం చూసి కూతురిలో కోరికలు ఎక్కువుతుంటాయి. దాంతో ఆమెలో కామం ఎక్కువయిందని డైరెక్ట్ చెబుతూ దర్శకుడు ఓ సినిమా తీశాడు. కానీ ఇక్కడకు వచ్చేసరికి అమ్మాయిలో ఆ క్లారిటీ మిస్ అవడమేకాకుండా  నా కూతురు కామంతో మీ ఇద్దరితో ఇలా ఆడుకుందని చెప్పించడం కరెక్ట్ అనిపించలేదు. ఇలా మారడానికి కారణం చెబితే బాగుండేది. అప్పుడు ప్రేక్షకులకు మరింత కన్వెన్సింగ్ గా వుండేది. 
 
ఈ చిత్రానికి నిమాటోగ్రఫీ  కీలకం. రొమాంటిక్ సన్నివేశాలను, పల్లెటూరి వాతావరణాన్ని బాగా చూపించారు. నేపథ్య సంగీతం బాగుంది. ఓ ఐటెం సాంగు కూడా జోడించారు. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. నిర్మాతలు తగిన విధంగా సినిమాను తీర్చిదిద్దారు. ప్రేమకు, కామానికి వున్న తేడాను ఈ చిత్రం ద్వారా దర్శకుడు చెప్పాడు. యూత్ ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దినట్లుంది. 
రేటింగ్: 2.75/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు