ది లెజెండ్ ట్విట్టర్ రివ్యూ... స్ఫూఫ్‌గా వుంది.. పాత చింతకాయ పచ్చడి..
గురువారం, 28 జులై 2022 (14:26 IST)
Legend
తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త శరవణన్ హీరోగా జేడీ అండ్ జెర్రీ ద్వయం తెరకెక్కించిన చిత్రమే 'ది లెజెండ్'. ఊర్వశీ రౌటేలా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శరవణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శరవణన్ స్వయంగా నిర్మించారు.
శరవణన్ నటించిన 'ది లెజెండ్' మూవీ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి.
ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు పూర్తిగా భిన్నమైన టాక్ వచ్చింది. ఇది ఏవరేజ్ అని కొందరు.. బిలో ఏవరేజ్ అని మరికొందరు ఫన్నీగా ట్వీట్లు చేస్తున్నారు.
'ది లెజెండ్' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం హీరో సాదాసీదా ఎంట్రీతో, పూర్తిగా తెలిసిన కథతో, ఎక్కడో చూసిన ఫీలింగ్ కలిగే సన్నివేశాలతో సోసోగా సాగిపోతుందట.
అంతేకాదు, ఇది ల్యాగ్ అయినట్లు కూడా అనిపిస్తుందట. అలాగే, సెకెండాఫ్ కూడా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించని విధంగా ఏవరేజ్‌గా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇందులో హారీశ్ జయరాజ్ అందించిన మ్యూజిక్, నిర్మాణ విలువలు తప్ప అన్నీ మైనస్ అనే ట్విట్టర్‌లో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లెజెండ్ సినిమా శివాజీ, కేజీఎఫ్ చాప్టర్ 2, మెర్సల్ వంటి చిత్రాలకు స్ఫూఫ్‌గా రూపొందినట్లు ఉందని కామెంట్లు చేస్తున్నారు.
శరవణన్ నటించిన 'ది లెజెండ్' సోసోగా సాగిపోతే పాత చింతకాయ పచ్చడి అని తెలుస్తోంది. అయితే, పేరడీ, స్ఫూఫ్ చిత్రాలను ఇష్టపడే వాళ్లు మాత్రం దీన్ని ఒకసారి చూడొచ్చట.
శరవణన్ నటించిన 'ది లెజెండ్' మూవీపై ట్విట్టర్ వేదికగా ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఓ నెటిజన్ 'విజయ్ నటించిన బిగిల్, బీస్ట్, భైరవ చిత్రాలతో పోలిస్తే ఇది చాలా బాగుంది' అని వెటకారంగా కామెంట్ చేశాడు. అలాగే మరో నెటిజన్ ఏకంగా ఈ సినిమా తమిళ చిత్ర పరిశ్రమకు 'అఖండ' అంటూ ఫన్నీ ట్వీట్ చేశాడు.