గత మూడు రోజులుగా తన సినిమా ప్రమోషన్ కోసం కష్టాలుపడ్డ హీరో విశ్వక్సేన్ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారాడు. ఆయన నటించిన కొత్త సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. విశ్వక్ గత చిత్రాలకు భిన్నంగా.. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో తెలుసుకుందాం.
కథ:
తెలంగాణా సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ బతికే అల్లం అర్జున్ కుమార్ (విశ్వక్సేన్)కు 30 ఏళ్ళ వచ్చినా పెల్లి కాలేదీని చుట్టుపక్కల వారు, చుట్టాలు పోరుపెడుతుంటే సంబంధాలు చూస్తాడు. కానీ ఏదీ సెట్ కాదు. ఆఖరికి గోదావరి జిల్లాకు చెందిన మాధవి (రుక్సర్ ధిల్లాన్)తో అతడికి పెళ్లి కుదురుతుంది. ఆనందంతో బస్సు వేసుకుని బంధుగణంతో నిశ్చితార్థం కోసం అమ్మాయి ఇంటికి వెళ్తుంది అర్జున్ కుటుంబం. కులాల పట్టింపు వున్నా అర్జున్ కోరిక మేరకు ఎలాగోలా ఆయన కుటుంబీకులు ఒప్పించుకుని తిరిగి వద్దామనుకుంటే బస్ చెడిపోతుంది. సరిగ్గా అది లాక్‌డౌన్ మొదటి వేవ్. ప్రభుత్వం నెలరోజులపాటు లాక్‌డౌన్ విధిస్తుంది. చేసేదిలేక వారి ఇంటిలోనే మకాం వేస్తారు. ఆ తర్వాత అనుకోకుండా ఓరోజు పెళ్లికూతురు మాధవి జంప్ అవుతుంది. ఇక ఆ తర్వాత అర్జున్ పరిస్థితి ఏమిటి? అనంతరం ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
ఆంధ్ర, తెలంగాణలోని మధ్య తరగతి ప్రజల జీవన విధానం, ఆచార వ్యవహారాలు, బంధుగణం వ్యక్తిత్వాలు అన్నీ కళ్ళకు కట్టినట్లు చూపించారు. పెండ్లి చేసుకోవాలంటే బంధువులకోసమో, చుట్టూ ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా, 30 ఏళ్ళు వచ్చినా ఆ పైనా కూడా చేసుకోవచ్చు. ఇద్దరి మనస్సులు కలిస్తే చాలు. కులాల పట్టింపులు వుండకూదు అని సందేశాన్ని ఇందులో తెలియజేశాడు దర్శకుడు.
ఈ చిత్రంలోని పాత్రలన్నీ తెలంగాణ, గోదావరి యాసలను మాట్లాడుతుంటేనే ప్రేక్షకుడికి రిలీఫ్‌గా అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు అలగడం వంటి సన్నివేశాలు కూడా సందర్భానుసారంగా వున్నాయి. గతంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా వచ్చింది. ఆ తరహాలో ఈ సినిమా వుంటుంది. అయితే పెండ్లికెళ్ళి లాక్‌డౌన్ వల్ల అక్కడే ఇరుక్కుపోవడం అనేది కాన్సెప్ట్ వివాహ భోజనంబు అనే సినిమాలో చూపించేశారు. కానీ ఆ సినిమాలో చాలా అంశాలు సరిగ్గా తీయలేదు. ఇందులో `అన్నీ సమపాళ్ళలో వున్నాయి.
హీరోగా విశ్వక్‌సేన్ ఒన్ మేన్ ఆర్మీ అని చెప్పాలి. గతంలో యారెగెంట్‌గా పాత్రలు చేశాడు. ఇందులో అమాయకత్వంతో కూడిన పాత్రను బాగా పండించాడు. హావభావాలు బాగా పలికాడు. రుక్షాన ఆమె పాత్ర మేరకు నటించింది. రితిక ఈ సినిమాలో హైలైట్. తను నటనాపరంగా బాగా చేసింది. ఇక మిగిలన పాత్రలన్నీ బాగానే వున్నాయి.
సంగీతపరంగా క్రిష్ బాణీలు, నేపథ్య సంగీతం బాగుంది. సాహిత్యం వినదగ్గదిగా వుంది. సినిమాటోగ్రఫీ బాగుంది.సంభాషణల్లో ఎక్కడా తేడా లేదు. కథనలో ప్రేక్షకుడు ఇన్‌వాల్వ్ అయ్యేలా వుంటుంది.
- ఆడపిల్ల పుడితే ఎదమొహం పెట్టేవారికి ఈ సినిమా చెంపపెట్టుగా అనిపిస్తుంది. ఆడవాళ్ళు తగ్గిపోతున్నారు. మా కులంలో అమ్మాయిలు లేరు అందుకే కులం కాకపోయినా వేరే కులం అమ్మాయి చేసుకోవడానికి వచ్చామంటూ హీరో తండ్రి చెప్పడం ఇందులో కీలక అంశం.
సో. ఇలాంటి సినిమా అందరూ కుటుంసమేతంగా చూడతగ్గది. ఈ సినిమా విడుదలకుముందు హీరో ఎంత పబ్లిసిటీ చేశాడో తెలిసిందే. అది కొంతమేరకు ఉపయోగపడుతుంది. అయితే సినిమా టైటిల్ పెద్దది కావడంతో ఇంకా ఇప్పటి జనరేషన్‌కు పట్టలేదు. సింపుల్‌గా ఆర్.ఆర్.ఆర్., కెజి.ఎఫ్. వంటి పేర్లను పెడితేనే యూత్ వస్తారనుకున్నా పొరపాటే. మిలిల్ క్లాక్ మెలోడీస్ అనే సినిమా బాగానే ఆడింది. అయితే అశోకవనంలో అర్జున కళ్యాణం థియేటర్‌లో చూడతగ్గ సినిమా.