లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్. ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించటంతో పాటు వైవిధ్యమైన, ఎవరూ రూపొందించని, ప్రేక్షకులను కట్టిపడేసే కథాంశాలున్న సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ పరంగానూ అండగా నిలుస్తోంది. ఆడియెన్స్‌ను అలరించే సినిమాలను సరైన సమయంలో అందించటంలో ఎప్పుడూ ముందుంటోంది. అందుకనే సినీ ప్రేమికులకు లైకా ప్రొడక్షన్స్ గురించిన పరిచయం అక్కర్లేదు.