ఇదే విధంగా అబ్బాయిలతో పల్లెత్తు మాట్లాడను, అంటూ దేవుడి ఫొటోల దగ్గర ప్రామిస్ చేస్తుంది ఓ అమ్మయి. కానీ మాట తప్పుతుంది. ఆ తర్వాత కాలేజీ రోజుల్లో వీరి ఆలోచనలు మారిపోతాయి. `నీ కళ్ళు నాకు ఏదో చెప్పాలనుకుంటున్నాయి` అని అబ్బాయి అంటే.. నీతో షార్ట్‌టర్మ్ రిలేషన్ చెప్పాలనుంది అంటుంది అమ్మాయి. అయినా చాలదన్నట్లు, నచ్చినంతవరకు నచ్చినంతగా ఎంజాయ్ చేయడమే.. అంటోంది అమ్మాయి.
ఓన్లీ ఎంజాయ్‌మెంట్ వరకే అయితే పర్లేదు.. అంటాడు అబ్బాయి. ఇదీ ఇప్పటి యూత్ సినిమా. యూత్ కోసమే తీశామని, పైగా ఇది అందరూ అనుకున్నట్లు కల్ట్ సినిమా కాదనీ, ఇది గోల్డ్‌లాంటి సినిమా అంటూ చెబుతున్నాడు. అంతేకాక ఇంటర్‌వెల్‌లో క్లాప్స్ కొడతారని దర్శకుడు చెబుతున్నాడు. పైగా క్లయిమాక్స్‌లో కళ్ళ నీల్ళు పెట్టిస్తుంది అంటూ తన సినిమా గురించి చెప్పకొచ్చారు దర్శక నిర్మాతలు.
ఆ సినిమా పేరు `ఇప్పుడు కాక ఇంకెప్పుడు`. టైటిల్‌కు తగినట్లే వుందని టీజర్ చూసిన వారంతా కామెంట్ చేస్తున్నారు. ఒకటికాదు రెండు కాదు దాదాపు పది రొమాన్సు సీన్లు వున్నాయి. టీజర్‌లోనే ఇంత వుంటే సినిమాలో ఎంత వుంటుందో. అసలే ఒక పక్క రాజకీయ నాయకుల బూతులతో యువత చెడిపోతుంటే, మరోవైపు ఇలాంటి సినిమా తీసి సభ్య సమాజానికి ఏమి చెప్పదలిచారని సినీ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమాకు యుగంధర్ దర్శకుడు, గోపాలకష్ణరెడ్డి నిర్మాత. మరి ఈ సినిమాకు సెన్సార్ వారు ఏమంటారో చూద్దాం.