Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

దేవీ

సోమవారం, 24 మార్చి 2025 (16:23 IST)
Suhas, Malavika
నటుడు సుహాస్ గురించి అందిరికీ తెలిసిందే. అమాయకత్వంతో కూడిన మొహంతో తనదైన నటనతో కథానాయకుడిగా ఎదిగిన సుహాస్ మరోవైపు యాడ్స్ కూడా చేస్తున్నారు. ఇటీవలే ఓ యాడ్ చేశాననీ, అందుకు బాగానే రెమ్యునరేషన్ ఇచ్చారనీ చెబుతూ, నాక్కూడా యాడ్స్ రావడం మొదట ఆశ్చర్యం వేసిందని అన్నారు. తాజాగా ఆయన నటించిన సినిమా 'ఓ భామ అయ్యో రామ'. మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో  కథానాయికగా పరిచయమవుతోంది. 

రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి  స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. వేసవిలో ఎంటర్‌టైన్‌చేయనున్న ఈ చిత్రం టీజర్‌ను సోమవారం విడుదల చేశారు మేకర్స్‌. 
 
ఈ సందర్బంగా పలు విషయాలు వెల్లడించారు. స్పిరిట్ సినిమాలో పాత్రను అనుకున్నారని వార్తలు వస్తున్నాయి. నాక్కూడా కరెక్ట్ గా తెలీదు అన్నారు. హిట్ 2 లో నెగెటివ్ రోల్ దర్శకుడు ఇచ్చారు. దానికి మంచి ఆదరణ లభించింది. అయితే తెలుగులో ఆతరహా కథలు తన వద్దకురాలేదనీ, తమిళంలో అలాంటి పాత్ర చేయబోతున్నానని అన్నారు.
 
నిర్మాత హరీష్‌ మాట్లాడుతూ '' ఈ సినిమా చేసిన నా టెక్నిషియన్స్‌, ఆర్టిస్ట్‌లు ఎంతో సపోర్ట్‌ చేసి మంచి ప్రొడక్ట్‌ను తీసుకొచ్చారు. బెస్ట్‌ క్వాలిటీ సినిమా ఇవ్వబోతున్నాం. పూర్తి ఎంటర్‌టైనింగ్‌గా రాబోతున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మీ హృదయాలను దోచుకుంటుంది. తప్పకుండా నిర్మాతగా ఓ మంచి సినిమాను ఇవ్వబోతున్నాం అనే నమ్మకం ఉంది అన్నారు.
 
హీరోయిన్‌ మాళవిక మాట్లాడుతూ '' ఈ సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది. నాకు తెలుగులో ఓ మంచి సినిమాతో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది అన్నారు.
 
రామ్‌ గోదాల మాట్లాడుతూ, నేను దర్శకుడి నా పేరు చూసుకోవడానికి కారణం హీరో సుహాస్‌. నిర్మాత హరీష్‌ కథ చెప్పగానే క్వాలిటీగా తీద్దామని చెప్పాడు. ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ ప్రొడక్ట్‌ క్వాలిటీగా రావడానికి ఆయనే కారణం. మణికందన్‌ ఫోటోగ్రఫీతో ఈ సినిమాను చాలా కలర్‌ఫుల్‌గా మలిచాడు.రథన్‌ ఈ లవ్‌స్టోరీకి చాలా మంచి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో ఉన్న ఆరుపాటలు వేటికవే అనే విధంగా బ్యూటిఫుల్‌గా ఉంటాయి అన్నారు.
 
టీజర్‌ను గమనిస్తే..
టీజర్‌లోని ప్రతి ఫేమ్‌ కలర్‌ఫుల్‌గా ఉంది. సుహాస్‌ ఎంతో ఎనర్జీగా కనిపించాడు. హీరోయిన్‌ మాళవిక, హీరో సుహాస్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో వినోదాన్ని పంచాయి. మనది బొమ్మరిల్లు కాదు, రక్తచరిత్ర అంటూ హీరోయిన్‌ చెప్పిన డైలాగ్‌.. చివర్లో అమ్మాయిలను నమ్మెద్దు బాబు. మోసం చేస్తారు బాబు అంటూ హీరో చెప్పే డైలాగ్‌ ఈ టీజర్‌లో అలరించే అంశాలు. టీజర్‌ క్వాలిటీ, ఫ్రేమ్స్‌ చూస్తుంటే ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడా  కూడా కాంప్రమైజ్‌ కాలేదని తెలుస్తోంది. అతి త్వరలో ఈ చిత్రం విడుదల తేదిని కూడా ప్రకటిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు