అమ్మ పొద్దస్తామనం చదువుకోమంటోంది... తల్లిపై పోలీసులకు కుమారుడు ఫిర్యాదు

ఠాగూర్

గురువారం, 18 సెప్టెంబరు 2025 (14:47 IST)
అమ్మ పొద్దస్తామనం చదువుకోమంటుంది అంటూ 11 యేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పైగా ఫోన్ కూడా చూడనివ్వడం లేదని పదేపదే చదువుకోమని సతాయిస్తుందంటూ ఏకంగా ఏసీపీకి ఫిర్యాదు చేశాడు. బాలుడు ఫిర్యాదుతో ఆశ్చర్యపోయిన ఏసీపీ.. బాలుడు తల్లిని పిలిపించి ఆమె ఎదుటు బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఆసక్తికర సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ సత్యనారాయణ పురం గులాబీతోట ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఇద్దరు కుమారులు.. భర్తతో విభేదాల కారణంగా పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటోంది. తాను ఓ దుకాణంలో పని చేస్తుండగా, పెద్ద కుమారుడుని మరో దుకాణంలో పనికి కుదిర్చింది. తమకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే ఇల్లును గడుపుతూ చిన్న కుమారుడిని చదివిస్తోంది. తాము ఇంటికి వచ్చే వరకు చిన్న కుమారుడు ఒంటరిగా ఉంటాడనే ఉద్దేశ్యంతో ఓ ఫోన్ కొనిచ్చింది. ఆరో తరగతి చదువుతున్న చిన్న కుమారుడు నిత్యం ఆ ఫోనులోనే గడుపుతూ, చదవడం మానేయడంతో తల్లి కుమారుడుని మందలించింది. 
 
దీంతో కోపగించుకున్న కుమారుడు.. నేరుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఏకంగా ఏసీపీ దుర్గారావుకు ఫిర్యాదు చేశాడు. ఆయన వెంటనే బాలుడు తల్లిని పిలిచి ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకుని చలించిపోయాడ. ఈ వయసులోచదువుకోకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే కష్టాల గురించి బాలుడుకి అర్థమయ్యేలా కౌన్సిలింగ్ ఇచ్చాడు. తల్లి పడుతున్న కష్టాన్ని గుర్తించాలని, బాగా చదువుకోవాలని బాలుడుకి నచ్చజెప్పి ఇంటికి పంపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు