పాన్ ఇండియా మూవీగా రాబోతున్న కబ్జా పలు భాషల్లో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. అంత కంటే ముందే మేకర్స్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేలా అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి ఈ టీజర్‌ను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు టీజర్ 25 మిలియన్ వ్యూస్‌ను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
టీజర్‌లో ఉపేంద్ర పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. ఆయన్ని అలాంటి పాత్రలో చూసిన ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీలో సన్నివేశాలను తెరకెక్కించిన కలర్, బ్యాగ్రౌండ్ స్కోర్, సీన్ టేకింగ్ డిఫరెంట్‌గా ఉంది. 1942 బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా ఇది. పవర్‌పుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారు. టీజర్ నెక్ట్స్ లెవల్‌లో ఉందని ఫ్యాన్స్, ప్రేక్షకులు అంటున్నారు. ఉపేంద్ర యాక్షన్ సీక్వెన్సెస్, రవి బస్రూర్ అందించిన గ్రిప్పింగ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఇటు ఉపేంద్ర.. అటు సుదీప్ అభిమానులు వారి ఆరాధ్య హీరోలను ఎప్పుడెప్పుడు వెండితెరపై చూద్దామా అని ఎదురు చూస్తున్నారు.
కన్నడ చిత్ర సీమలోని మరో అగ్ర కథానాయకుడు శివరాజ్ కుమార్ కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వటం కొస మెరుపు. ఈ ముగ్గురి స్టార్స్‌కి చెందిన ఫ్యాన్స్‌కి ఇది ఐ ఫీస్ట్‌గా ఉండబోతుంది. ఈ పీరియాడిక్ డ్రామాలో శ్రియా శరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎ.జె.శెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.