Upendra, Meenakshi Jaiswa, Praneetha
ఉపేంద్ర హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం కంచర్ల. రెడ్డెం యాద కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి జైస్వాల్, ప్రణీత హీరోయిన్లుగా ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వైజాగ్‌లోని రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా జరిగింది. ఈ చిత్రంలో బాహుబలి ప్రభాకర్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర, హీరోయిన్లు మీనాక్షి జైస్వాల్, ప్రణీతలపై తొలి షాట్‌ని దర్శకుడు రెడ్డెం యాద కుమార్ చిత్రీకరించగా సమర్పకులు కె. అచ్యుతరావు క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు.