చియాన్ విక్రమ్, దుషార విజయన్ జంటగా నటించిన సినిమా వీర ధీర సూర. సేతుపతి, చిత్తా సినిమాల దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకుడు. హెచ్.ఆర్. పిక్చర్స్, రియా శిబు నిర్మించిన ఈ సినిమా రెండు భాగాల యాక్షన్, ఫ్యామిలీ డ్రామా. ఇంట్రస్టింగ్ గా ఈ చిత్రం యొక్క రెండవ భాగం మొదట మార్చి 27న విడుదల కానుంది. ఎన్.వి.ఆర్ సినిమా తెలుగు రైట్స్ ని సొంతం చేసుకోగా, నైజాం రిలీజ్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జరుగుతుంది.