పూర్ణ ప్రదాన పాత్రలో P19 ట్రాన్సమీడియా స్టూడియోస్ పతాకంపై పటోళ్ళ వెంకట్ రెడ్డి సమర్పణలో సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఎమోషనల్ థ్రిల్లర్ కథా చిత్రం "డార్క్ నైట్". ఈ చిత్రాన్ని జి.ఆర్.ఆదిత్య దర్శకత్వం వహించారు. పూర్ణ ఆమె సరసన కథ, వీకెండ్ లవ్,పి వి ఎస్ గరుడవేగా,24 కిస్సెస్, కథ కంచికి మనం ఇంటికి, ప్రేమదేశం, మనమే వంటి చిత్రాలలో నటించిన త్రిగుణ్ (ఆదిత్ అరుణ్), నటించగా విధార్థ్, సుభాశ్రీ రాయగురు, మిగతా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ కి సిధమైంది. కాగా ఈ రోజు ఉదయం దర్శకుడు వి వి వినాయక్ చేతుల మీదుగా చిత్రానికి చెందిన రిలీజ్ ను సోనీ మ్యూజిక్ ద్వార విడుదల చేయడం జరిగింది.