''దఢక్''-''జింగ్‌ జింగ్‌ జింగ్‌ జింగాట్‌'' సాంగ్ రిలీజ్.. జాన్వీ డ్యాన్స్ సూపర్ (వీడియో)

బుధవారం, 27 జూన్ 2018 (16:36 IST)
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దఢక్ సినిమా ద్వారా ఆమె ప్రేక్షకులను పలకరించనుంది. హీరో షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖత్తర్‌ కథానాయకుడిగా నటించారు. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌‍కు మంచి స్పందన లభించింది. 
 
తాజాగా దఢక్ సినిమా యూనిట్ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. ''జింగ్‌ జింగ్‌ జింగ్‌ జింగాట్‌'' అని సాగే ఈ పాటను కలర్‌ఫుల్‌గా తెరకెక్కించారు. జాన్వి గులాబి, నీలిరంగు లెహెంగాలో మెరిశారు. ఆమె, ఇషాన్‌ తెగ ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. 
 
ఈ పాటను విడుదల చేసిన గంటలోనే యూట్యూబ్‌లో దాదాపు 2 లక్షల మంది వీక్షించారు. కాగా మరాఠీ బ్లాక్‌బస్టర్ ''సైరాత్''కు హిందీ రీమేక్‌గా దఢక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 20వ తేదీన విడుదల కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు