తిరుమల బ్రహ్మోత్సవాలు: కల్పవృక్ష వాహనంపై శ్రీవారు

తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామి నాలుగో రోజైన ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై ఊరేగారు. రాత్రి సర్వ భూపాల వాహన సేవలను అందుకోనున్నారు.

కల్పవృక్షం కోరినవారికి మాత్రమే వరాలిస్తుంది. తన భక్తులకు అడగకుండానే వరాలిచ్చే దేవదేవుడు వెంకటాద్రివాసుడు. కల్పవృక్షం... అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలదు. కానీ స్వామి శాశ్వతకైవల్యం ప్రసాదించే కల్పతరువు. నాలుగో రోజు ఉదయం ఈ వాహనంపై వెంకన్న సర్వాలంకార భూషితుడై ఊరేగాడు.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్‌లు భక్తులతో నిండిపోయాయి. స్వామి వారి సర్వదర్శనానికి 19 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఐదు గంటలు సమయం పడుతోంది.

వెబ్దునియా పై చదవండి