తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. సప్తాశ్వాలపై భానుడు రథసారధిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగారు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్య భగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెప్పేలా ఈ వాహన సేవ సాగింది.
అలాగే, ఏడో రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్ప స్వామి ఊరేగుతారు. ఏడోరోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పూల మాలలు ధరించి స్వామి చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని ఈ వాహనాల ద్వారా తెలియజేస్తారు.