శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం రాత్రి స్వామివారు శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతారు. హంస అనే శబ్ధానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమైన మనోమందిరమని అర్థం.
తుచ్ఛమైన కోరికలనే అంధకారాన్ని వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తిమార్గం వైపు నడవాలని ఈ వాహనం ద్వారా స్వామి వారు చాటుతారని తితిదే ప్రధాన అర్చకులు అంటున్నారు.
అలాంటి హంస వాహన సేవను వీక్షించేందుకు భక్తులు భారీ ఎత్తున తిరుమల చేరుకున్నారు. శారదాదేవి రూపంలో సర్వాలంకారభూషితుడైన శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు.