తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం హనుమ వాహనంపై దేవేరుడు ఊరేగారు. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన హనుమంతుడిని వాహనంగా చేసుకుని స్వామి తిరువీధుల్లో ఊరేగాడు. హనుమంతుని భక్తి తత్పరతను చాటి చెపుతూ, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ వాహనం ద్వారా స్వామి తెలియజేశారు.
అలాగే, ఆరో రోజు రాత్రి గజవాహనంపై ఊరేగారు. గజేంద్రమోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే శరణుకోరే విధంగా కాపాడుతానని చాటి చెప్పడానికి స్వామి ఈ వాహనంపై ఊరేగాడు. గజవాహనుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.