టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్.. యనమలకు ఏమౌతారు?

గురువారం, 28 సెప్టెంబరు 2017 (10:40 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ పేరు దాదాపు ఖరారైంది. ఈయన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి బంధువు. అందులోను బిసి సామాజిక వర్గానికి చెందిన నేత. కడపజిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. చదలవాడ కృష్ణమూర్తి, అధ్యక్షుడిగా ఉన్న టిటిడి పాలకమండలిలో బోర్డు సభ్యులుగా కూడా ఉన్నారు పుట్టా సుధాకర్ యాదవ్.
 
ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి సహకారంతో టిటిడి ఛైర్మన్ పదవిని దక్కించుకోనున్నారు. ఇప్పటికే చిత్తూరుజిల్లా మదనపల్లికి చెందిన రవిశంకర్ అనే పారిశ్రామిక వేత్త పేరు తెరపైకి వచ్చినా చంద్రబాబునాయుడు ఏ మాత్రం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయంతో సుధాకర్ యాదవ్‌కే అవకాశం దక్కేట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు