తిరుమల బ్రహ్మోత్సవాలు : ముత్యపు పందిరిపై విహరించిన శ్రీనివాసుడు
తిరుమలలో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి మహోత్సవాల్లో మూడో రోజైన సోమవారం రాత్రి మలయప్ప స్వామి ముత్యపు పందిరిపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు.
ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని ఈ వాహనం ద్వారా స్వామివారు లోకానికి చాటి చెబుతారు. మూడవరోజు సోమవారం రాత్రి శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేశారు.