బ్రహ్మోత్సవాలు: చంద్రప్రభ వాహనంపై తిరుమలేశుడు

గురువారం, 6 అక్టోబరు 2011 (14:33 IST)
బ్రహ్మోత్సవాల్లో ఏడవరోజు రాత్రి శ్రీవారు చంద్రప్రభ వాహనంపై దివ్యమంగళ స్వరూపునిగా భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామి విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు.

చంద్రోయం కాగానే కలువలు వికసిస్తాయన్నది మనకు తెలిసిందే. చంద్రోదయ వేళ సాగరుడు నురగలుకక్కుతో ఉవ్వెత్తున అలలతో సంతోషంతో ఉప్పొంగుతాడు. చంద్రుని దర్శనం వలన మనసు నిర్మలంగా, ఉల్లాసంగా ఉంటుంది.

అందుకే తిరుమలేశుడు తన భక్తులకు చల్లని చంద్రప్రభవాహనంపై సుఖసంతోషాలను కల్గించేందుకు దర్శనమిస్తాడు.

వెబ్దునియా పై చదవండి