వరాహస్వామిని దర్శించుకుంటే..? పుష్కరిణి పుణ్యస్నానం!

తిరుమల క్షేత్రంలో ఆదిదైవం శ్రీ వరాహస్వామి. అందుకే ఈ పుణ్యతీర్థాన్ని ఆది వరాహ క్షేత్రమని పిలుస్తుంటారు. వైకుంఠం వదిలి భూలోకం వచ్చిన శ్రీనివాసునికి వరాహస్వామి వారే స్థలాన్ని ప్రసాదించారు. దీనికి ప్రతిఫలంగా భక్తుల తొలి దర్శనాన్ని వరాహస్వామి పొందారు.

దానితో పాటు తొలిపూజ, తొలినైవేద్యం వరాహస్వామికే. సామాన్య భక్తుడి నుండి ప్రముఖుల వరకు తొలుత వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీ వేంకటేశ్వరుడుని దర్శించుకుంటున్నారు. దీన్ని కొనసాగిస్తేనే పుణ్యఫలం దక్కుతుంది.

అలాగే పుష్కరిణిలో స్నానమాచరిస్తే పుణ్యమంటారు. భక్తుల మొక్కులలో పరమ పవిత్రమైంది పుష్కరిణి స్నానం. బ్రహ్మాండంలోని సర్వ తీర్థాల నిలయం శ్రీవారి పుష్కరిణి. పుష్కరిణి దర్శించడం, తీర్థాన్ని సేవించడం, పుణ్యస్నాన మాచరించడంతో సర్వపాపాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుంది.

ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల చివరి రోజున చక్రస్నానం కార్యక్రమాన్ని పుష్కరిణిలో వేడుకగా నిర్వహిస్తారు. అలాగే, ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.

వెబ్దునియా పై చదవండి