శ్రీవారికి రికార్డుస్థాయి ఆదాయం: నాలుగోరోజున రూ.2.51 కోట్లు

సోమవారం, 3 అక్టోబరు 2011 (22:42 IST)
WD
బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగో రోజున తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.2.51 కోట్లకు చేరుకుంది. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫలితంగా హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది.

పరకామణి లెక్కల ప్రకారం రూ. 2.10 కోట్లు నేరుగా హండీకి చేరుకున్నాయి. శ్రీవారి ప్రసాదాల అమ్మకం, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.41.17 లక్షల ఆదాయం ఒనగూరింది. అన్నదానంలో 80.6 వేల మంది భక్తులు భోజనం చేశారు. ఆదివారం ఒక్క రోజే 92,283 మందికి టిటిడి దర్శనం కల్పించింది.

వెబ్దునియా పై చదవండి