స్వర్ణరథంపై బ్రాహ్మాండ నాయకుని దర్శనం

బుధవారం, 5 అక్టోబరు 2011 (20:38 IST)
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో మంగళవారం తిరుమలేశుడు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాలంకరణా భూషితుడైన మలయప్ప స్వామి స్వర్ణరథంపై ఊరేగిన వైభవాన్ని భక్తకోటి తిలకించి ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు.

అశేషభక్తజన సందోహంతో కిక్కిరిసిన తిరుమల కొండ గోవింద నామస్మరణతో దద్ధరిల్లింది. సాంప్రదాయ బద్ధమైన కోలాటాలు, అన్నమయ్య సంకీర్తనల నడుమ శ్రీవారు దివ్యపురుషుడుగా స్వర్ణరథంపై తిరుమాడవీధుల్లో ఊరేగారు.

వెబ్దునియా పై చదవండి