"లక్ష్మీ కల్యాణం"తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన పంచదార బొమ్మ "కాజల్ అగర్వాల్". "మగధీర" హిట్‌తో టోలీవుడ్ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్.. ఎక్స్‌పోజింగ్‌తో అవకాశాలు వస్తాయా..? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చింది.
ఎక్స్‌పోజింగ్ వల్ల అవకాశాలు రావని కాజల్ తేల్చి చెబుతోంది. అంతేకాదు.. మీరు బికినీలు వేస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. గ్లామరస్‌గా కనిపిస్తానే గానీ, బికీనీలు మాత్రం వేయనని కాజల్ అగర్వాల్ స్పష్టం చేసింది.
"చందమామ" సినిమాతో అవకాశాలను అంతగా చేతికందుకోని కాజల్ సినీ కెరీర్‌ను "మగధీర" సినిమా మలుపు తిప్పింది. చందమామ తర్వాత పౌరుడు, ఆటాడిస్తా, సరోజా వంటి చిత్రాలు కాజల్‌కు అంతగా గుర్తింపు సంపాదించి పెట్టలేదు. కానీ రామ్‌చరణ్ తేజ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించి హాలీవుడ్ స్థాయి రికార్డు సృష్టించిన "మగధీర" సినిమా కాజల్ అగర్వాల్‌కు మంచి పేరు సంపాదించి పెట్టింది.
"మగధీర" తర్వాత గణేష్, ఆర్య-2, ఓం శాంతి వంటి సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్.. తాజాగా ప్రభాస్ సరసన "డార్లింగ్", ఎన్టీఆర్ సరసన బృందావనం, నాగచైతన్య సరసన మరో చిత్రం చేయనుంది. టోలీవుడ్‌లో మాత్రమే గాకుండా.. కోలీవుడ్‌లో ఆఫర్లతో బిజీ బిజీగా ఉంటోన్న కాజల్ అగర్వాల్ వ్యక్తిగత వివరాలను తెలుసుకుందామా...?
పూర్తి పేరు: కాజల్ అగర్వాల్, పుట్టిన తేదీ: జూన్ 19, 1985 (వయసు 24), జన్మస్థలం: ముంబై, నచ్చిన వస్త్రాలు: చీర, నచ్చిన స్పాట్: లండన్, నచ్చిన పానీయం: వైట్ టీ, ఫేవరేట్ నటుడు: అమీర్ ఖాన్ ఫేవరేట్ నటి: శ్రీదేవి.