"రోజా" నుంచి "జై హో" వరకు సంగీత సాగరంలో తేలిన ముత్యంలా యావత్తు ప్రపంచాన్ని ఆకట్టుకున్న సంగీత మాంత్రికుడు. ఎ.ఆర్. రెహ్మాన్. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన "స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రానికి సంగీతం సమకూర్చి అరుదైన రెండు ఆస్కార్ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న రెహ్మాన్ నేటితో (జనవరి 6) 44 ఏట అడుగుపెట్టారు.
"స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రంలోని " జై హో" పాటకు రెండు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించి, బాప్టా, గోల్డెన్ గ్లోబ్ అవార్డులతో సొంత గడ్డకు గొప్ప పేరు సంపాదించిపెట్టారు. ఇంకా 1992 సంవత్సరంలో జై హో హీరో రెహ్మాన్.. సంగీత సముద్రంలో ఆరంగేట్రం చేశారు.
1992వ సంవత్సరంలో "రోజా" సినిమా ద్వారా కంపోజర్‌గా పరిచయమైన రెహ్మాన్.. తర్వాత "రంగీళ", బాంబే, రంగీలా, తాళ్, స్వదేశ్, లగాన్, రంగ్ దె బసంతి, గురు, జోధా అక్బర్, గజిని వంటి హిట్ చిత్రాలకు సంగీతం సమకూర్చారు.
ఇంకా వందేమాతరం, 1997వ సంవత్సరంలో రెహ్మాన్ విడుదల చేసిన "మా తుజే సలామ్", చెయ్యాన్ చెయ్యాన్ (తమిళం), ప్యా హజి అలి వంటి పలు ఆల్బమ్‌లు ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఇలా ఆల్బమ్‌లతో పాటు సంగీత దర్శకుడిగా హవా కొనసాగిస్తోన్న రెహ్మాన్ కెరీర్‌ను "స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రంలోని "జై హో" పాట మలుపు తిప్పింది.
సంగీత అభిమానులను తన అద్భుతమైన పాటలతో ఇట్టే ఆకట్టుకుంటోన్న ఎ.ఆర్. రెహ్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన వ్యక్తిగత విషయాలు తెలుసుకుందామా..
అసలు పేరు: ఏ.ఎస్. దిలీప్ కుమార్ ఇతర పేర్లు: ఎ.ఆర్. రెహ్మాన్, అల్లా రక్షా రెహ్మాన్ జననం: జనవరి 6 1966 (1966-01-06) వయసు: 44 జన్మస్థలం: చెన్నై, తమిళనాడు, వృత్తులు: కంపోజర్, రికార్డ్ ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరక్టర్, గాయకుడు, ప్రోగ్రామర్, అరేంజర్.