ఎంఎస్ నారాయణ స్వస్థలం భీమవరానికి సంక్రాంతి పండుగని వచ్చి ఆదివారం సాయంత్రం స్థానిక హోటల్‌లో గది తీసుకున్నారు. ఆహారం తీసుకున్న అనంతరం రాత్రివేళ ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.సన్నిహితులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఫుడ్ పాయిజనని చికిత్స చేశారు. అనంతరం ఆయనను అక్కడ నుంచి అత్యవసర చికిత్స కోసం విజయవాడకు తరలించారు.
విషయం తెలుసుకున్న ఎంఎస్ కుమారుడు, సినీ హీరో విక్రమ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సోమవారం సాయంత్రం వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.