రోడ్డుపై మండుతున్న కారు, చూద్దామని ఆగినవారిపైకి దూసుకొచ్చింది (video)

ఐవీఆర్

ఆదివారం, 13 అక్టోబరు 2024 (22:27 IST)
జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారి వంతెనపై ఓ కారు అగ్నిప్రమాదానికి గురైంది. కారు అలా అగ్నికీలల్లో మండుతుండగా రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దానిని చూస్తూ అలా నిలబడిపోయారు. ఇంతలో మండుతున్న కారు కాస్తా కదలడం ప్రారంభించింది. దీనితో అది వస్తున్న దారిలో పార్కింగ్ చేసి వుంచిన బైకులను తీసుకుని వాహనదారులు పరుగులు పెట్టించారు. మరికొందరు పాదచారులు బతుకు జీవుడా అంటూ పరుగు లంఘించుకున్నారు. అలా మండుతూ వున్న కారు రోడ్డుపై సుమారు 100 మీటర్ల వరకూ దూసుకు రావడంతో రోడ్డుపై వున్నవారు భయాందోళనకు గురయ్యారు.

తగలబడుతున్న కారును చూస్తున్న జనాలకి సరిగా కనబడుతోందో లేదో అని వారు చూసేందుకు వీలుగా తానే దగ్గరకి వస్తున్న కారు. pic.twitter.com/WJtHtIeJ9z

— SwethaTDP (@tdp_team67) October 13, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు