కరోనావైరస్ పరిస్థితి దేశంలో తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పటికే దేశంలో కరోనావైరస్ తీవ్రత వున్న రాష్ట్రాల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ వంటివి విధిస్తున్నారు. ఐతే వీటితో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచన చేసింది.
అదేమిటంటే... ప్రజలు తమ ఇంట్లో వున్నా కూడా మాస్కులు వేసుకోవాలని చెప్పింది. కరోనావైరస్ వ్యాప్తిపై అధికారులు సోమవారం నాడు మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో అనవసరంగా ఎవ్వరూ బయటకు రాకూడదు. అంతేకాదు ఎవరనీ ఇంటికి ఆహ్వానించవద్దు. కుటుంబ సభ్యుల మధ్య వున్నప్పటికీ అందరూ మాస్కులు వేసుకోవాలి అని నీతి ఆయోగ్ సభ్యులు వి.కె. పాల్ చెప్పారు.