సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతమైన విషయాలను, అత్యంత వినోదకరమైన అంశాలను చూడగలుగుతున్నాం. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ చిన్నారి బ్యాండ్ వాయించడం ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంత చిన్న వయసులో అతడిలోని ప్రతిభను చూసి అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.