మొదటి జంట, ముందుగానే వచ్చి, తలుపు వెలుపల తమ చెప్పులను ఉంచారు. రెండో జంట వచ్చేసరికి పక్కనే ఉన్న గది బయట తెలిసిన చెప్పులను గమనించిన వ్యక్తికి అనుమానం వచ్చింది. అతను తలుపు తట్టాడు. మరొక వ్యక్తి పలకరించాడు. ఇది మరిన్ని ప్రశ్నలను లేవనెత్తింది.
వీడియో బాగా వైరల్ అవుతోంది. అయితే వీడియో చూస్తుంటే కేవలం నవ్వుకోవడం కోసమే స్కిట్ చేసినట్లుగా ఉంది. ఇదే విషయాన్ని నెటిజన్లు పసిగట్టారు. వ్యూస్, లైక్స్ కోసమే ఇదంతా చేశారని కామెంట్స్ షేర్ చేస్తున్నారు. అయితే వీడియో మాత్రం నవ్వుకోవడానికి పనికొస్తుందని ప్రతీ ఒక్కరూ షేర్ చేస్తున్నారు.