బాబ్-కట్ ఏనుగు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

శనివారం, 7 నవంబరు 2020 (22:35 IST)
Sengamalam
తమిళనాడు మన్నార్‌గుడిలోని రాజగోపాలస్వామి ఆలయంలో ఓ ఏనుగు వుంది. ప్రస్తుతం ఈ ఏనుగు హెయిర్ స్టైల్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏనుగు ''బాబ్-కట్'' హెయిర్‌స్టైల్‌తో అందరినీ ఆకట్టుకుంది.  వివరాల్లోకి వెళితే.. తమిళనాడు మన్నార్‌గుడిలోని రాజగోపాలస్వామి ఆలయంలో సెంగమళం అనే ఏనుగు వుంది. 
 
ఈ ఏనుగు ఆలనాపాలనా చూస్తున్న మావటివాడు దీనికి 'బాబ్-కట్' హెయిర్‌స్టైల్‌ చేయించాడు. దీంతో నాటి నుంచి ఈ ఏనుగును 'బాబ్-కట్ సెంగమలం' అని పిలుస్తున్నారు. ఈ ఆడ ఏనుగును 2003లో కేరళ నుంచి ఈ ఆలయానికి తీసుకువచ్చారు.
 
ఈ ఏనుగు తన బిడ్డలాంటిదని మావటి రాజగోపాల్‌ తెలిపారు. దీనికి పత్యేకత ఉండాలని భావించానని, బాబ్‌-కట్‌తో ఉన్న ఏనుగు పిల్ల వీడియో చూసి  అదే తరహాలో సెంగమలం జుట్టును తీర్చిదిద్దినట్లు చెప్పారు.
 
దీంతో నాటి నుంచి 'బాబ్-కట్' హెయిర్‌స్టైల్‌తో అందరిని ఆకట్టుకుంటున్నదని రాజగోపాల్‌ వెల్లడించారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు సెంగమలంతో ఫొటోలు దిగి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో ఈ 'బాబ్-కట్' హెయిర్‌స్టైల్‌ ఏనుగు ఎంతో ఫేమస్‌ అయ్యిందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు