తాళికట్టే శుభవేళ ఓ వధువు వరుడికి షాకిచ్చింది. తమిళనాడు నీల్‌గిరీస్‌లోని మట్టకండి గ్రామంలో జరిగిన ఈ ఘటన పెళ్లిమండపంలోని అందరినీ అశ్చర్యానికి గురిచేసింది. నా ప్రియుడు నా కోసం వస్తున్నాడని, ఈ పెళ్లి నాకొద్దంటూ వరుడు తాళికట్టే సమయంలో పేర్కొన్న వధువు అందరినీ విస్మయానికి గురిచేసింది. కరోనా నిబంధనల దృష్ట్యా కొద్దిమంది బంధువుల సమక్షంలో ఇరువురి కుటుంబసభ్యులు అక్టోబర్ 29న ముహూర్తం పెట్టుకున్నారు.