అదెలాగో చూద్దాం. వైసీపికి చెందిన కొత్త మంత్రులు వరుసబెట్టి మంచి ముహూర్తం చూసుకుంటూ సచివాలయంలో ఆయా ఛాంబర్లలోకి వెళ్తున్నారు కదా. మొత్తం 25 మంత్రులకు అధికారులు ఆయా ఛాంబర్లను కేటాయించారు. దాంతో వారివారి ఛాంబర్లలోకి ప్రవేశిస్తున్నారు మంత్రులు. ఐతే ప్రత్యేకించి ఓ మంత్రి మాత్రం తనకు కేటాయించిన ఛాంబర్ గది 188 చూసి జడుసుకున్నారట. తనకు ఆ ఛాంబర్ వద్దు బాబోయ్ అని చెప్పారట.
ఇంతకీ ఆ ఛాంబర్ ఎవరిదయా అంటే... గతంలో అది మాజీ మంత్రి నారా లోకేష్ బాబుది. ఈ ఛాంబర్‌ను ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అధికారులు కేటాయించారట. విషయం తెలుసుకున్న మంత్రిగారు తనకు ఆ ఛాంబర్ వద్దుబాబోయ్ అంటూ చెప్పారట. దాంతో ఆయనకి సచివాలయంలోని 3వ బ్లాక్‌లోని 203 రూమ్‌ను ఛాంబర్‌గా కేటాయిస్తూ ఏర్పాట్లు చేశారట. అదీ సంగతి.