అయోధ్య ఆలయ నిర్మాణ పనులు.. రుద్రాభిషేకంతో జూన్ 10 నుంచి మొదలు

ఆదివారం, 7 జూన్ 2020 (16:43 IST)
శ్రీరామ జన్మభూమి అయోధ్యలో జూన్ 10 నుంచి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. లంక విజయానికి ముందు శ్రీరాముడు శివారాధన చేశారని.. అందుకే రామాలయం నిర్మించే ముందు శివారాధన చేస్తామని తెలిపారు. ఈ నెల 10 నుంచి అయోధ్యలో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్న తరుణంలో ముందుగా.. రుద్రాభిషేకం చేసి పనులు ప్రారంభం కానున్నట్లు శ్రీరామ్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రకటించింది. 
 
ఇందులో భాగంగా రామ్ జన్మభూమి కాంప్లెక్స్ లోని శశాంక్ శేఖర్ ఆలయంలో జూన్ 10 న రుద్రాభిషేకం తర్వాత నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఆలయ నిర్మాణానికి పునాది వేసేందుకు ఎల్ అండ్ టి సంస్థ జూన్ 10న పనులు ప్రారంభిస్తుందని తెలుస్తోంది. 
 
ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సన్నాహాలు పూర్తయ్యాయి. జూన్ 10న, మహంత్ కమల్ నయన్ దాస్ ఇతర సాధువులతో రుద్రాభిషేక క్రతువును ఉదయం 8:00 గంటలకు ప్రారంభిస్తారని.. ఈ ఆరాధన 2 గంటల పాటు జరుగనుందని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ పేర్కొంది. ఆ తర్వాత ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు