మొత్తం 90 అసెంబ్లీ సీట్లకుగాను బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత కాంగ్రెస్ 31 సీట్లతో సరిపుచ్చుకోగా, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) 10 సీట్లను గెలుచుకుని కింగ్ మేకర్‌గా అవతరించింది.
ఇందుకు ప్రతిఫలంగా జేజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవిని కమలనాథులు కట్టబెట్టనున్నారు. అలాగే, ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ఉండనున్నారు. మరోవైపు, హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ మరోమారు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. శనివారం జరిగే బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్‌లో ఆయన పేరును ఎన్నుకునే అవకాశం ఉంది.