జేజేపీకి కాంగ్రెస్ బంపర్ ఆఫర్... మద్దతిస్తే ముఖ్యమంత్రి పీఠం ఇస్తాం! (Video)

గురువారం, 24 అక్టోబరు 2019 (11:01 IST)
హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరన్న విస్పష్ట తీర్పును ఇవ్వనట్టు తెలుస్తోంది. గురువారం ఉదయం ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపు ఉదయం 11 గంటల ట్రెండ్ మేరకు... ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కే సూచనలు కనిపించడం లేదు. ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కర్నాటక తరహా ఫార్ములాను తెరపైకి తెచ్చింది. తమకు మద్దతిస్తే ముఖ్యమంత్రి పీఠం ఇస్తామంటూ ప్రకటించింది. జేజేపీ పార్టీ అధినేత దుశ్యంత్ చౌతలాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతామని హామీ ఇచ్చింది. 
 
గురువారం ఉదయం నుంచి వెలువడుతున్న ఫలితాల్లో తొలి రౌండ్ నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా, నేనా అనే రీతిలో సాగుతున్నాయి. ఈ ఫలితాలపై జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) అధ్యక్షుడు దుశ్యంత్ చౌతాలా మీడియాతో మాట్లాడుతూ ఈ ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు 40 సీట్లు మించి దక్కించుకోలేవని, అధికారాన్ని చేపట్టే తాళం చెవి తమ దగ్గరున్నదన్నారు. 
 
ఉదయం 11 గంటల ట్రెండ్ మేరకు బీజేపీ 40 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 31, జేజేపీ 9, ఐఎన్ఎల్డీ 1 సీటు చొప్పున ఆధిక్యంలో ఉన్నాయి. ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండగా, ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ బీజేపీ రెండోసారి అధికారంలోకి వస్తుందంటూ అంచనా వేశాయి. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ మార్క్ 46 సీట్లు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు