అత్యాచారం కేసులో బీజేపీ నేత చిన్మయానంద అరెస్టు

శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (12:00 IST)
బీజేపీ నేత, మాజీ మంత్రి స్వామి చిన్మయానందను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది. 73 యేళ్ల నేతను అత్యాచారం కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన అస్వస్థతకు లోనుకావడంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా, న్యాయశాస్త్ర విద్యార్థిని చిన్మయానందపై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన ఆరోపణలకు ఆధారాలుగా 43 వీడియోలను పెన్‌డ్రైవ్‌లో విచారణ బృందానికి అందజేసింది. ఆధారాలు అందజేయడంతో చిన్మయానంద తనను తన కుటుంబ సభ్యులను హతమార్చుతానని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపించింది. 
 
ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు సహాయం చేయాలని బాధిత యువతి విజ్ఞప్తి చేసింది. పైగా, ఈ వ్యవహారం పెను వివాదం కావడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించి విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం విచారణ జరిపి... చిన్మయానందను అరెస్టు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు