ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. కొత్త పెళ్లి కొడుకు తండ్రి కావాలనే కల పెళ్లైన మూడో రోజే నెరవేరింది. అవును మీరు చదువుతున్నది నిజమే. వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్‌రాజ్‌లోని కార్చన తహసీల్‌కు చెందిన యువకుడు బంధువుల బృందం వివాహం చేసుకునేందుకు అమ్మాయి ఇంటికి ఫిబ్రవరి 24న జస్రా గ్రామానికి వెళ్ళింది. అమ్మాయి తరపు వాళ్లు ఘనంగా స్వాగతం పలికారు. అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి తర్వాతి రోజు ఫిబ్రవరి 25న వధువు వీడ్కోలు జరిగింది.
మరుసటి రోజు ఫిబ్రవరి 26 ఉదయం, కోడలు నిద్ర లేవగానే, ఆమె టీ తయారు చేసి అందరికీ పంపిణీ చేసింది. ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంది. అదే రోజు సాయంత్రం అకస్మాత్తుగా వధువు ఏడవడం ప్రారంభించింది. ఆమె కడుపు నొప్పిగా ఉందని చెబుతూ కేకలు వేయడం ప్రారంభించింది. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే కార్చన సిహెచ్‌సికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించగా, ఆమె గర్భవతి అని తేలింది.
అయితే అసలు సంగతి అక్కడే మొదలైంది. దీనిపై అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడుతూ, గత సంవత్సరం వివాహం నిశ్చయమైంది, పెళ్లికి ముందు నుంచే వరుడు తమ కూతురిని కలిసేవాడని చెప్పారు. గత ఏడాది మే నెలలో కూతురి వివాహం నిశ్చయించబడిందని అమ్మాయి తండ్రి తెలిపారు.